మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటిటి రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. గతేడాది మొదలుపెట్టిన ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతోంది. సినిమా కొనుగోళ్ల విషయంలో కూడా అల్లు అరవింద్ దూకుడుగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల వరకూ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వంటి సంస్థలతో పోటీ పడుతున్నారు.
రీసెంట్ గా అల్లు అరవింద్ నిర్మాణంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. అల్లు అరవింద్ సొంత సినిమా కాబట్టి కచ్చితంగ ఆహాలో ప్రదర్శింపబడుతుందని అందరూ భావించారు.
అయితే అందరికీ షాక్ ఇస్తూ అరవింద్ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కు అమ్మేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ భారీ అమౌంట్ ను కోట్ చేయడంతో కాదనలేక ఈ నిర్ణయం తీసుకున్నాడట. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే.
Recent Random Post: