ఆలియా కరోనా భయంతో ఆర్‌ఆర్ఆర్ మరింత ఆలస్యం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ను కరోనా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది మార్చి లో కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. చాలా నెలల తర్వాత పునః ప్రారంభించిన జక్కన్నకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. వచ్చే నెలతో సినిమా షూటింగ్‌ ను ముగించేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్న జక్కన్నకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. హీరోయిన్ ఆలియా భట్ రూపంలో ఆ షాక్ జక్కన్న ను వెంటాడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

త్వరలో ప్రారంభం కాబోతున్నా ఆర్ఆర్ఆర్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ లో ఆలియా భట్ పాల్గొనాల్సి ఉంది. కాని ఆమె నటించిన గంగూభాయ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరియు ఆమె ప్రియుడు ఇద్దరు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఇటీవల వారితో కలిసిన కారణంగా ఆలియా రెండు వారాలు పూర్తిగా హౌస్‌ అరెస్ట్‌ అవ్వబోతుంది. ఐసోలేషన్‌ లో ఉంటున్న కారణంగా ఆర్ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ లో ఆమె జాయిన్ అవ్వలేక పోతుంది. ఆ కారణంగా ఈ సినిమా మరింతగా ఆలస్యం అవుతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక సమస్య వస్తే సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేయగలరా అంటే అనుమానమే అనిపిస్తుంది.


Recent Random Post: