హమ్మయ్య! గంగూభాయికి అంతా సజావుగానే!!

ఆలియా టైటిల్ పాత్రలో నటించిన సినిమా గంగూభాయి కథియావాడీ. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు ఈ సినిమా ప్రివ్యూలతో సందడి నెలకొనగా ఈ శుక్రవారం గంగూభాయి ప్రపంచవ్యాప్తంగా తెలుగు-హిందీ వెర్షన్లలో విడుదలవుతోంది. ఇక ఈ మూవీ నిజజీవిత కథతో తెరకెక్కించిన బయోపిక్ కేటగిరీకి చెందుతోంది. దీంతో రిలీజ్ ముంగిట పలు వివాదాలు ముసురుకున్నాయి.

రియల్ వ్యక్తుల కథతో సినిమా తీస్తున్నప్పుడల్లా కోర్టు కేసులు సర్వసాధారణం. భన్సాలీకి ఇవి కొత్తేమీ కాదు. గంగూభాయి పైనా పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దర్శకుడు చాలా కేసులను ఎదుర్కొంటున్నాడు. అయితే సినిమా విడుదలను నిలిపివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఇప్పుడు ఉపశమనం లభించింది.

గంగూబాయికి దత్తపుత్రుడిగా చెప్పుకునే వ్యక్తి గంగూబాయిని హీనంగా చిత్రీకరించారని సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనప్పటికీ అలియా భట్ సినిమా లాయర్లు నిజానికి గంగూబాయి కామాటిపురా ప్రజలకు ఏమి చేసిందో గొప్పగా తెరపై చూపారని..తనను తక్కువ స్థాయిలో చూపించలేదని ధృవీకరించారు.

అదే సమయంలో సినిమా తరపున వాదిస్తున్న న్యాయవాదులు దాదాపు 11 సంవత్సరాల క్రితం హసన్ జైదీ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారని ఇప్పుడు సినిమాగా తీసినందున ఈ వ్యక్తులందరూ కంటెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వాదించారు. అలాగే ఈ దత్తపుత్రుడిని గంగూబాయి నిజంగా దత్తత తీసుకున్నట్లు రుజువు ఏమైనా ఉందా? అని లాయర్లు ప్రశ్నించారు.

వాదనలను పరిగణనలోకి తీసుకున్న SC చిత్రం విడుదలను నిలిపివేయడానికి నిరాకరించింది. అయితే పేరు మార్పు సమస్య మరి కాసేపటికి తుది స్పష్టత వస్తుంది. ఇప్పటికే ముంబై సెలబ్రిటీ షో అనంతరం సెలబ్ రివ్యూల నుంచి ఆలియా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.


Recent Random Post: