డీసెంట్ అమౌంట్ కు అమ్ముడుపోయిన అల్లరి నరేష్ నాంది

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. కనీసం వీకెండ్ లో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కరువయ్యాయి. నరేష్ కు సైతం ఈ సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు. అందుకే సరిగా ప్రచారం కూడా చేయలేదు. అయితే తన దృష్టి మాత్రం నాంది మీద ఉంది.

కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సీరియస్ సబ్జెక్ట్ చుట్టూ సాగుతోంది. విడుదలైన టీజర్ కూడా సినిమాపై మంచి అంచనాలను కలిగేలా చేసింది. తాజా సమాచారం ప్రకారం జీ స్టూడియోస్ వాళ్ళు ఈ సినిమాను గుంపగత్తగా ఎనిమిదిన్నర కోట్లకు కొనేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయలేదట.

అది పూర్తవ్వగానే మంచి రిలీజ్ డేట్ ను చూసుకుని అనౌన్స్మెంట్ చేస్తారని అంటున్నారు. జీ స్టూడియోస్ ఇటీవలే ఈ స్ట్రాటజీను అవలంబిస్తోంది. ముందు హోల్ సేల్ గా సినిమా హక్కులు కొనేయడం, తర్వాత థియేటర్లలో విడుదల చేయడం, కొన్ని రోజులకే జీ ప్లెక్స్ లో స్ట్రీమ్ చేయడం, ఆ తర్వాత నుండి ఇక జీ5 లో అందుబాటులో ఉంచడం. నాంది విషయంలో కూడా అదే జరగొచ్చు.


Recent Random Post: