తెలుగు చిత్ర పరిశ్రమకు ఈరోజు బిగ్ డే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. సీనియర్ హీరో చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకున్నారు.
చిరంజీవితో పాటు మహేష్ బాబు – ప్రభాస్ – రాజమౌళి – కొరటాల శివ – నిర్మాత నిరంజన్ రెడ్డి – ఆర్.నారాయణమూర్తి – అలీ – పోసాని కృష్ణమురళి తదితరులు జగన్ ను కలవనున్నారు. అయితే కీలమైన ఈ భేటీకి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెళ్లకపోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత కార్యక్రమం కోసం చెన్నై వెళ్తున్న అల్లు అరవింద్ ను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఇదే విషయం మీద మీడియా ప్రశ్నించింది. తమ కుటుంబం నుంచి చిరంజీవి వెళ్తున్నారని.. కాబట్టి తాను హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈరోజుతో అన్ని సమస్యలకు ఇవాళ్టితో ఎండ్ కార్డ్ పడుతుందని పేర్కొంటూ.. ఇండస్ట్రీకి మేలు జరిగే ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడటానికి గతంలో అల్లు అరవింద్ కూడా ఏపీకి వెళ్లారు. కానీ ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోతో పాటుగా ఇతర సమస్యలపై చర్చించడానికి వెళ్లకపోవడంపై అనేక వార్తలు వినిపించాయి. గతంలో ఏపీ ప్రభుత్వాన్ని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. విసిగిపోయి మరోసారి సమావేశానికి వెళ్ళడానికి అల్లు అరవింద్ ఆసక్తి చూపించలేదని కామెంట్స్ వచ్చాయి.
ఇప్పుడు తమ ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్తున్నారు కాబట్టి తాను వెళ్లడం లేదని పరోక్షంగా ఈ విషయాన్ని చిరంజీవి మీదకు తోసేసారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలానే చిరంజీవి కేవలం తనకు మాత్రమే సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని చెప్పడాన్ని బట్టి.. స్టార్ ప్రొడ్యూసర్ కు ఏపీ ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ అందలేదా?
అందినా వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయలేదా? అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఎవరు వెళ్లినా ఈసారి అన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలని అందరూ కోరుకుం
Recent Random Post: