అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్‌

ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఈయన పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కూడా పుష్ప సినిమా కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్‌ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్‌ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్‌ లో పలువురు ఇప్పుడు కరోనా తో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్‌ అనే విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే బన్నీ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగా కాంపౌండ్ వర్గాల వారు అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న వారు అంతా కూడా ఇప్పుడు సెల్ప్‌ క్వారెంటైన్ కు వెళ్లి పోయారు. ఇక అల్లు అర్జున్‌ ఇంట్లోనే క్వాటైన్‌ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ పిల్లలు మరియు భార్య కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. వారి రిపోర్ట్‌ నెగటివ్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Recent Random Post: