మెగా మావయ్యలను ఫాలో చేస్తున్న అల్లు బోయ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో కనబరిచే శ్రద్ధ ఆప్యాయతలు వేరు. అభిమానుల్ని దేవుడిచ్చిన వరంగా భావించి వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. తన ఫ్యాన్స్ ని ఎవరైనా ఏమైనా అనాలనుకున్నా ఊరుకోరు. అదీ అతని కళ్ల ముందు అలాంటి సన్నివేశం ఎదురైతే ఎదుటివాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా సరే తనదైన శైలిలో స్పందించి అభిమానుల్ని కాపాడతారు. బౌన్సర్లు ఫ్యాన్స్ ని బలంగా పక్కకు నెట్టినా ఎంత క్రౌడ్ లో నైనా సరే అలాంటి పనులు చేయొద్దని వారిస్తారు. ఫోటోల కోసం ఎగబడితే ఓ హగ్ ఇచ్చి..సెల్పీ తీసుకుని పంపిస్తారు. అందుకే పవన్ అభిమానుల పాలిట దేవుడిగా కీర్తింపబడుతున్నారు.

మరి ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నారా? అంటే ఓ సన్నివేశం అవుననే చెబుతోంది. ప్రస్తుతం `పుష్ఫ` షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. బన్నీ పై మాస్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా బన్నీ ఎలాంటి మేకప్ లేకుండా కనిపిస్తున్నారు. అయితే ఓ జూనియర్ ఆర్టిస్ట్ స్పాట్ లో ఆయనతో ఫోటో తీసుకోవాలని ఆశపడి బన్ని వైపుకు ముందుకు కదిలారు. దీంతో బన్నీ బౌన్సర్లు ఆమెను అడ్డుకున్నారు. ఇప్పుడు బన్నితో ఫోటో దిగడం కుదరడని నెట్టే ప్రయత్నం చేసారు. ఆ సన్నివేశం పక్కనే ఉన్న బన్నీ చూసి కోపగించుకున్నాడు. అలా తోసేస్తారు! ఏంటి అని బన్నీ సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత ఆమెను దగ్గరకు తీసుకుని మాట్లాడి.. ఫోటోకి సాయపడి పంపించేశారు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ బన్నీ డౌన్ టు ఎర్త్ స్వభావంపై ముచ్చటగా చెప్పుకుంచింది. పెద్ద స్టార్ అయినా ఎలాంటి యాట్యిట్యూడ్ చూపించకుండా ఎంతో హుందాగా నడుచుకున్నారని కన్నీళ్లు చెమర్చింది. బన్నీ అందరితో చనువుగా కలిసిపోయే మనస్తత్వం గలవారు. పేద.. ధనిక అనే తారతమ్యాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. చాలా విషయాల్లో మెగా బాస్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని బన్ని అనుసరిస్తుంటారు. కెరీర్ పరంగా హార్డ్ వర్క్ .. సాటి తారలు సాంకేతిక నిపుణులతో వ్యవహారికం కానీ లేదా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కానీ అన్నిటా చిరుని పవన్ ని ఫాలో చేసేందుకు ఇష్టపడతాడు.


Recent Random Post: