అల్లు అర్జున్ కు టీఎస్‌ఆర్టీసీ లీగల్ నోటీసులు

అల్లు అర్జున్‌ ఇటీవల ర్యాపిడో ఆన్ లైన్ బైక్‌ సర్వీస్ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు. అల్లు అర్జున్‌ పై ఒక యాడ్‌ ను చిత్రీకరించడం జరిగింది. అందులో అల్లు అర్జున్‌ దోశలు వేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడకు ఆర్టీసీ బస్సు రావడం.. అందులో నుండి జనాలు పెద్ద ఎత్తున దిగడం చూపించారు. అందుకే ఇబ్బంది లేకుండా హాయిగా ర్యాపిడో వాడండి అంటూ అల్లు అర్జున్‌ చూచిస్తాడు. ఆ విషయంలో ఇప్పుడు చిక్కుల మొదలు అయ్యాయి.

అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో వాళ్లకు కూడా ఆర్టీసీ వారు నోటీసులు పంపించారు. ఆర్టీసీ ఎండీ అయిన సజ్జనార్‌ ఈ నోటీసులను పంపించారు. ఆర్టీసీని అవమానించే విధంగా అల్లు అర్జున్‌ ర్యాపిడో యాడ్‌ ఉందంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆర్టీసీ లో రోజు వారి జనాలు ఎంతో సుఖంగా సౌక్యంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాంటిది వారు ఇబ్బంది పడుతున్నట్లుగా మీరు ఎలా చూపిస్తారు అంటూ నోటీసులో పేర్కొన్నారు. లీగల్ నోటీసులకు బన్నీ అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Recent Random Post: