నా డివోర్స్ విషయంలో ఎవరూ సపోర్ట్ చేయలేదు – అమలా పాల్

Share

దక్షిణాదిలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన అమలా పాల్ గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే పెళ్ళైన కొన్ని నెలలకే వీరి మధ్య వచ్చిన విబేధాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు.

రీసెంట్ గా అమలా పాల్ మీడియాతో మాట్లాడుతూ “నా డివోర్స్ సమయంలో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. విడిపోవాలి అనుకున్నప్పుడు అందరూ నాకు ఫోన్స్ చేసి నీకు ఇక కెరీర్ ఉండదు అని బెదిరించారు. నా మానసిక స్థితి గురించి, నా పరిస్థితి గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు” అని అమలా పాల్ ఎమోషనల్ అయింది.

తెలుగులో నాయక్ వంటి సినిమాల్లో నటించిన అమలా పాల్ రీసెంట్ గా డిజిటల్ అంతోలోజి సిరీస్ పిట్ట కథలులో నటించింది. ఈ సిరీస్ లో మీరా పార్ట్ లో నందిని రెడ్డి డైరెక్షన్ లో అమలా పాల్ నటించింది. ఆ సిరీస్ లో అనుమానాస్పద భర్త కారణంగా బాధింపబడే భార్యగా కనిపించింది అమలా.


Recent Random Post: