నాగ చైతన్యతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ టాప్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఈ గ్రీన్ ఇనిషియేటివ్ లో పాల్గొన్న ఆమిర్ ఖాన్ దీని పట్ల హర్షం వ్యక్తం చేసాడు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జె ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్, ఆమిర్ ఖాన్ కు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఇద్దరికీ సినిమా సెట్స్ లో మంచి బాండింగ్ ఏర్పడింది.

ఈరోజు నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆమిర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేస్తున్నాడు.


Recent Random Post: