నా బాడీ మగాడి బాడీలా ఉందని ట్రోల్‌ చేసేవారు

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే కెరీర్‌ ఆరంభంలో దారుణమైన ట్రోల్స్‌ ను ఎదుర్కొందట. ఆ ట్రోల్స్‌ కారణంగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీలో తాను రాణించలేనేమో అంటూ తనకు తాను అనుకుని ఆత్మ విశ్వాసం కోల్పోయిందట. ఒకప్పుడు అంతగా ట్రోల్స్ ను మోసిన అనన్య పాండే ఇప్పుడు బాలీవుడ్‌ లోనే స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నన్ను ట్రోల్‌ చేస్తున్న వారిపై అనన్య పాండే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను కెరీర్ ఆరంభించిన సమయంలో.. నన్ను మగాడిలా ప్లాట్ గా ఉన్నావు. నీ బాడీ షేమింగ్‌ అబ్బాయిలా ఉందంటూ కామెంట్‌ చేసేవారు. వారసత్వం ఉందని అబ్బాయిలా ఉన్న నువ్వు కూడా హీరోయిన్‌ గా రాబోతున్నావా అంటూ నన్ను చాలా మంది అవహేళన చేశారు. ఆ సమయంలో నేను పడ్డ మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. అందుకే నేను గత కొన్నాళ్లుగా ట్రోల్స్ గురించి పట్టించుకోవడం మానేశానంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఈమె లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సెప్టెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Recent Random Post: