యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ మధ్యమధ్యలో స్పెషల్ సాంగ్స్ లో నర్తించడానికి అస్సలు మొహమాట పడదు. రీసెంట్ గా కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. పైన పటారం… లోన లొటారం అంటూ సాగే ఈ సాంగ్ ఈరోజు విడుదలైంది.
ఇదిలా ఉంటే ఈ సాంగ్ గురించి ఒక నెటిజెన్ చేసిన కామెంట్ పై అనసూయ ఫైర్ అయింది. ఒక నెటిజెన్ “అయినా ఐటెం సాంగ్స్ చేయను అన్నారు కదండీ? అయినా ఆ లిరిక్స్ ఏందీ?” అని అనసూయను ట్యాగ్ చేసి అడిగితే, దానికి అనసూయ ఫుల్ ఫైర్ అయింది.
“హలో! అది ఐటెం సాంగ్ కాదు, ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్ళు. అప్పుడు ఐటెం సాంగ్ అని సంబోధించేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అనే అనాలి. అయినా ఆ లిరిక్స్ వల్లే నేను ఈ సాంగ్ ఒప్పుకున్నాను. నేనెక్కడా స్పెషల్ సాంగ్స్ చేయను అని అనలేదు. నా గురించి ఏదైనా సందేహాలు ఉంటే నన్నే డైరెక్ట్ గా వెటకారం లేకుండా అడిగితే తప్పకుండా చెబుతాను” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.
Hello!!?Adi “item” song kadu..asalu “item” song anedi edi ledamma..oka paata ki unna cast kakunda special ga evaranna kavali anukunnappudu “special” song ostundi
Okappudu ammai ni vastuvu la treat chesevallu ichina peru adi
And aa Lyrics valle nenu ee special song oppukunnanu ? https://t.co/JP2Ak0ZeVB— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 2, 2021
Recent Random Post: