వీడియోః క్వారెంటైన్ లో ఈ ముద్దులేంటి అమ్మడు?


సెకండ్ వేవ్ తో ఎక్కువ మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. దేశ వ్యాప్తంగా వందల మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నట్లుగా రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది అదృష్టవశాత్తు కోలుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కమ్ ప్లే బ్యాక్ సింగర్ అయిన ఆండ్రియా జెరిమియా కూడా కరోనా కారణంగా క్వారెంటైన్ లో ఉందట. క్వారెంటైన్ లో ఉన్నట్లుగా పేర్కొన్న ఆండ్రియా ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తన క్యూట్ కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో కుక్క పిల్ల ఆండియాను నాకుతూ ఉంది.

క్వారెంటైన్ లో ఉన్న ఆండ్రియా ఎలా ఇలా కుక్క పిల్లతో నాకించుకుంటుంది అంటూ ఫాలోవర్స్ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించాల్సిందే.. ప్రతి ఒక్కరు ఈ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే. అలా కాదని కరోనాతో బాధపడుతున్న ఆండ్రియా కుక్క పిల్లతో అంత చనువుగా ఉండటం బుగ్గలపై నాకించుకోవడం ఖచ్చితంగా తప్పే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే జంతువులకు కరోనా వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. జంతువులకు కరోనా సోకి అది మళ్లీ మనసుషులకు వస్తే అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ఒక విశ్లేషణ. ఇలాంటి సమయంలో కరోనా పేషంట్ల వద్దకు కుక్క పిల్లలతో పాటు ఇతర ఏ పెంపుడు జంతువులు ఉండకూడదు అంటున్నారు. కాని ఆండ్రియా మాత్రం తన బుగ్గలను నాగించుకుంటూ.. అది కూడా వీడియోను షేర్ చేసింది. ఆండ్రియాను ఏమనాలో అర్థం కావడం లేదు.


Recent Random Post: