గూగుల్ సెర్చ్‌ చూసి అరియానానే ఆశ్చర్యపోయింది

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 లో అరియానా ఫినాలే వరకు వెళ్లింది. అరియానా చేసిన హంగామా హడావుడిని అభిమానులు ఆధరించారు. అంతకు ముందు వరకు పెద్దగా ఎవరికి తెలియని అరియానా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది. రామ్‌ గోపాల్‌ వర్మ వల్ల కాస్త ఫేమస్ అయిన అరియానా ఇప్పుడు బిగ్ బాస్ తో మరింతగా గుర్తింపు దక్కించుకుంది. గూగుల్ లో Princess of Bigg Boss Telugu అని టైప్‌ చేస్తే అరియానా పేరు ఫొటో వస్తోంది. షో లో ఒక సారి ప్రిన్సెస్ గా టాస్క్‌ లో చేసింది. దాంతో ఆమె సీజన్‌ మొత్తంకు మాత్రమే కాకుండా తెలుగు బిగ్ బాస్ కే ప్రిన్సెస్‌ అయ్యింది.

ఈ విషయాన్ని అభిమానులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లగా ఆశ్చర్య పోయింది. ఆమె ఆ స్క్రీన్‌ షాట్‌ ను షేర్‌ చేసి నిజంగానా అంటూ తన ఊత పదం సీరియస్లీ అంటూ కామెంట్‌ పెట్టింది. బిగ్ బాస్ తర్వాత అరియానా బాగా బిజీ అయ్యింది. అంతా అనుకున్నట్లుగానే బిగ్‌ బాస్ తర్వాత అరియానా గోవాలో రామ్‌ గోపాల్ వర్మను కలిసింది. ఇటీవల శ్రీముఖి ముక్కు అవినాష్‌ ఇంకా ఇతరులు వెళ్లిన గోవా ట్రిప్‌ లో అరియానా కూడా ఉంది. ఆ సందర్బంగానే గోవాలో ఉన్న రామ్‌ గోపాల్ వర్మను అరియానా కలిసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో కలిసిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.


Recent Random Post: