అరియానా గ్లోరీ.. బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐ యామ్ బోల్డ్ అంటూ బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగు పెట్టిన ఈ భామ ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్బాస్ కంటే ముందు యూట్యూబ్ యాంకర్‌గా ఉన్న అరియాన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది.
ఇంటర్వ్యూలో సమయంలో తనను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఎంట్రీ కొట్టెసిన అరియాన గ్లోరీ అసలు పేరు చాలా తక్కువ మంది తెలుసు. బిగ్ బాస్ తొలి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సైతం తన అసలు పేరు అడిగినప్పటికీ ఈ అమ్మడు రీవీల్ చేయలేదు. తనకు అరియానా పేరు అంటేనే ఇష్టమని, అసలు తన పాత పేరు గుర్తు కూడా లేదండూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చిన ఈ అరియానా గ్లోరీ అసలు పేరు మంగలి అర్చన. అయితే ఈ పేరు చాలా మందికి తెలియదు.. కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబీకులు మాత్రమే తెలుసు. వారు మాత్రమే తనని అప్పడప్పుడు అర్చన అని పిలుస్తారని, బయట వారంత అరియానా అనే పిలుస్తారట. ఎందుకంటే అర్చన పేరు తనకు కలిసి రాకపోవడం అరియానా గ్లోరీగా పేరు మార్చుకుందట. ఇదిలా ఉంటే అరియానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Recent Random Post: