ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన బిగ్ బాస్ ఫేమ్ అరియనా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ తనదైన శైలి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. స్పార్క్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ను స్థాపించి దాని ద్వారా కంటెంట్ ను విడుదల చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్ అరియనా ఇటీవలే ఆర్జీవీను బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది.

మిమ్మల్ని ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ చేసాను. దాని ద్వారానే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది అని చెప్పుకుంది అరియనా. నీ అందం వల్లే నేను పొగిడాను. నాకు ఏం అనిపించిందో అది చెప్పాను. దాని వల్లే అవకాశం వచ్చిందంటే నేను నమ్మను అని అన్నాడు.

చాలా మంది మీతో నాకు సంబంధాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు అని అరియనా అనగానే ఒక ఆడ, మగ మధ్య స్నేహాన్ని చూడలేకే అలాంటి కూతలు కూస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అన్నాడు వర్మ. ఈ మధ్యన మీరు అప్సరా రాణిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఆమెతో మీరు రిలేషన్ లో ఉన్నారా అని ప్రశ్నించగా తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని అన్నాడు.


Recent Random Post: