ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ ఇంట విషాదం

సింగర్ అర్జిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు. ఈయన పాడిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఆషీకీ సినిమాలో తుమ్ హీ హో సాంగ్ అయితే అర్జిత్ కు ఎక్కడలేని ఖ్యాతిని తీసుకొచ్చింది. ఇప్పటికీ టాప్ సింగర్ గా బాలీవుడ్ లో కొనసాగుతోన్న అర్జిత్ ఇంట విషాదం చోటు చేసుకుంది.

అర్జిత్ తల్లి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె మరణానికి కోవిద్ కారణమని తెలుస్తోంది. ఇటీవలే అర్జిత్ సింగ్ తల్లికి కరోనా సోకింది. దీంతో వెంటనే కోల్కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తూ వచ్చారు.

ఆమె ఆసుపత్రిలో చేరిన తర్వాత ఏ నెగటివ్ బ్లడ్ అవసరం వచ్చింది. పలువురు ప్రముఖులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.


Recent Random Post: