దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో, భళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది.
పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెలల పిల్లగా చిన్నగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB
— DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021
Recent Random Post: