గత నాలుగు రోజుల నుండి టాలీవుడ్ లో సందడి మాములుగా లేదు. ఒకరి తర్వాత ఒకరుగా వరసగా సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తుండడంతో మొత్తం కోలాహలంగా మారింది. దాదాపుగా 20 సినిమాల వరకూ రిలీజ్ డేట్లను ప్రకటించేసాయి. అయితే అందులో నందమూరి బాలకృష్ణ చిత్రానికి సంబంధించిన అప్డేట్ లేదన్న అసంతృప్తి నందమూరి అభిమానుల్లో ఉంది.
అయితే ఇది గమనించారో ఏమో కానీ బాలయ్య నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. దీనికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.
ఈ సినిమాను మే 28న విడుదల చేయబోతున్నారు. అదే రోజున రవితేజ ఖిలాడీ రిలీజ్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తోన్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
#BB3 Roar in theatres from May 28th, 2021?#BB3RoarOnMay28th#NBK106 #BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/50wSkkkVit
— Dwaraka Creations (@dwarakacreation) January 31, 2021
Recent Random Post: