బాలయ్య సినిమాలో నారా వారబ్బాయి?

నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. 2019లో చేసిన మూడు సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. దీంతో భారీ సక్సెస్ తో తిరిగి ఫామ్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తనకు కలిసొచ్చిన దర్సకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య కూడా సమ్మర్ కే వస్తుండడంతో సందడి ఇంకాస్త పెరిగింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నారా వారబ్బాయి రోహిత్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ గత కొన్నేళ్లుగా సక్సెస్ లేకుండా ఉన్నాడు. మూడేళ్ళుగా సినిమానే చేయలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలో స్పెషల్ రోల్ అంటే కచ్చితంగా తన కెరీర్ కు భారీ హెల్ప్ అవుతుంది. ఈ చిత్రంలో ఎమ్మెల్యేగా నారా రోహిత్ కనిపిస్తాడని సమాచారం.


Recent Random Post: