బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లెజండ్ ద్వారా విలన్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. ఈ డెసిషన్ జగపతి బాబు కెరీర్ ను ఎంతలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగపతి బాబు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ లలో ఒకరిగా మారిపోయాడు.
ఇక మరోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో కూడా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదట అందరూ ఇది నెగటివ్ రోల్ అని అనుకున్నా కూడా కాదని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య మిత్రుడిగా కీలక పాత్రను జగ్గూ భాయ్ పోషిస్తున్నాడు.
ఇక నటుడు శ్రీకాంత్ విలన్ బ్యాచ్ లో ఒకడిగా కనిపించనున్నాడని సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది.
Recent Random Post: