నందమూరి బాలకృష్ణ మే నెలలో అంటే వచ్చే నెలలో అఖండ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా బాలయ్య ఆ రెండు సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అఖండ సినిమా విడుదల వాయిదా పడ్డట్లే అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమాను జూన్ లేదా జులై లో థియేటర్లు మునుపటి పరిస్థితికి వచ్చిన తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమాను మే లో కాకుండా జూన్ నుండి పట్టాలెక్కించాలని కూడా నిర్ణయించారు. జూన్ లో సినిమాను ప్రారంభించి కేవలం నాలుగు నెలల్లోనే సినిమా ను విడుదలకు సిద్దం చేయాలని బాలయ్య ఇప్పటికే గోపీచంద్ కు సూచించాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అఖండ మరియు గోపీచంద్ మిలినేని సినిమాలు ఈ ఏడాదిలో విడుదల చేయాల్సి ఉండగా, వచ్చే ఏడాది ఆరంభంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న రామారావు గారు సినిమాను బాలయ్య ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
Recent Random Post: