ఎక్స్‌క్లూజివ్‌ : బాలయ్య గోపీచంద్‌ మూవీ డబుల్‌ డోస్‌

నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్‌ ల కాంబినేషన్‌ లో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం తగ్గి బాలయ్య అఖండ సినిమా షూటింగ్‌ ముగించిన వెంటనే గోపీచంద్‌ సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు. బాలకృష్ణ మరియు గోపీచంద్‌ మలినేని కాంబో మూవీ గురించి చాలా రోజులుగా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ద్వి పాత్రాభినయం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. చాలా ఏళ్ల క్రితం రాయలసీమలో జరిగిన ఒక సంఘటను తీసుకుని దానికి కల్పిత కథనంను అల్లి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్దం అయ్యాడు. ప్రముఖ హీరోయిన్స్ లు ఇద్దరు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: