ఎన్నికలొస్తే చాలు నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో హాస్యరసాన్ని పండించేందుకు రెడీ అయిపోతుంటారు. ఇంతకుముందు జనరల్ ఎలక్షన్స్ లో ఆయన తనదైన మార్క్ `పాలిట్రిక్స్` హాస్యాన్ని పండించగా టీవీ చానెళ్లు టీఆర్పీ గేమ్ కోసం అతడిని ఉపయోగించుకున్నాయి.
ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎంఐఏ) ఎన్నికల్లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కామెడీలు ఏ రేంజులో ఉండబోతున్నాయో అంటూ అప్పుడే గుసగుసలు వేడెక్కించేస్తున్నాయి. ఇంతకుముందే వైరల్ గా షేర్ అయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో బండ్ల గ్రూప్ ఫోటోలో కనిపించారు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను మీడియా ముఖంగా పరిచయం చేయగా బండ్ల అతడి వెనకే వెన్నుదన్నుగా కనిపించారు.
ఇక మీడియా సమావేశంలో బండ్ల తనదైన మార్క్ హాస్యంతో అలరించడం చర్చకు వచ్చింది. ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అతడి స్పీచ్ ఉపకరించింది. ప్రకాష్ రాజ్ 23 ఏళ్ళకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఎవరైనా అతన్ని స్థానికేతరుడు అని ఎలా పిలుస్తారు. ఆయన షాద్ నగర్ సమీపంలో సొంత భూమిని కలిగి ఉన్నాడు. నేనే అతనికి భూమి ఇచ్చాను. ఇక్కడ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా స్వచ్ఛంద కార్యక్రమాల్ని చేస్తున్నాడు.. అని తెలిపారు. అలాంటి ఆయనను స్థానికుడు కాదని అంటారా? అని బండ్లా గణేష్ నిలదీసారు.
తెలుగు వారిగా జన్మించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా శాసిస్తున్నాడని అలాగే రాజమౌళి హాలీవుడ్ మూవీ చేసేంతగా ఎదిగారని ఎగ్జాంపుల్ ఇచ్చిన బండ్ల ప్రకాష్ రాజ్ ని స్థానికత గురించి అడగడం సరికాదని అన్నారు. మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు బైట్లు అడగొద్దు.. నా నాలుక ఏదో ఒకటి మాట్లాడుతుంది తర్వాత వివాదంగా మారుతుందని బండ్ల హాస్యాన్ని పండించారు.
Recent Random Post: