బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. బిగ్ బాస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసింది. మొన్నటి ఎపిసోడ్ లో నలుగురు కెప్టెన్సీ రేసులో నిలిచిన విషయం తెల్సిందే. షణ్ముఖ్, ప్రియాంక, సిరి, రవిల మధ్య పోటీతో నిన్నటి టాస్క్ కొనసాగింది. ప్రియాంక నియంత సీట్ లో కూర్చోగా సిరి, షణ్ముఖ్, రవిల మధ్య ఛాలెంజ్ సాగింది. ఆ ఛాలెంజ్ లో భాగంగా హాకీ తరహాలో బాల్స్ ను ఎవరి గోల్ పోస్ట్ లలోకి వారు పంపాలి. ఈ టాస్క్ లో బాటమ్ 2లో సిరి, రవి నిలిచారు. ప్రియాంక, సిరి లేకపోతే తాను కెప్టెన్సీ టాస్క్ ను బాగా ఆడగలను అని చెప్పి సిరిని ఎలిమినేట్ చేసి రవిని సేవ్ చేసింది.
ఆ తర్వాత నియంత సీట్ లో షణ్ముఖ్ కూర్చున్నాడు. ఆ కూర్చునే క్రమంలో ప్రియాంకను రవి తోసినట్లుగా ఆరోపించారు. నిజానికి సిరిను ఉంచి రవిని ఎలిమినేట్ చేసినా ప్రియాంకకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉండేదేమో. షణ్ముఖ్ నియంత సీట్ లో కూర్చోవడంతో తను రవిని సేవ్ చేసి ప్రియాంకను ఎలిమినేట్ చేసాడు. ఎలిమినేట్ చేసే ముందు ప్రియాంక తాను కెప్టెన్ అయితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక ఉదాహరణ సెట్ చేసినట్లు అవుతుందని తెలిపింది. రవిని సేవ్ చేస్తున్నా అని షణ్ముఖ్ చెబుతున్నప్పుడు సన్నీ తన పుట్టినరోజు కదా కన్సిడర్ చెయ్ అని చెబుతుంటే కాజల్ వచ్చి మరోసారి ట్రాన్స్జెండర్ అంటోంది కదా అని గుర్తు చేసింది.
దీనికి షణ్ముఖ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. అలాంటి మాటలు మాట్లాడి తనను తప్పుగా ప్రోజెక్ట్ చేయొద్దు అని గట్టిగా హెచ్చరించాడు. అక్కడ జరిగిన గొడవలో ప్రియాంక తనను తాను కొట్టుకుంది. మొత్తానికి రవి, షణ్ముఖ్ లలో ఓటింగ్ ప్రక్రియ జరగ్గా షణ్ముఖ్ కు ఐదు ఓట్లు, రవికి 1 ఓటు పడింది. దీంతో ఇంటి లాస్ట్ కెప్టెన్ గా షణ్ముఖ్ నిలిచాడు.
ఆ తర్వాతి రోజు బిగ్ బాస్ ఇల్లు బిబి ఎక్స్ ప్రెస్ గా మారింది. సందర్భానుసారం ట్రైన్ సౌండ్ వినిపించినప్పుడు హౌజ్ లో అందరూ బోగీలుగా మారాల్సి ఉంటుంది. అలాగే బిగ్ బాస్ ఎప్పటికప్పుడు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. నిన్నటి ఎపిసోడ్ లో హౌజ్ లోకి ముందుగా కాజల్ భర్త, కూతురు వచ్చారు. ఈ సందర్భంగా ఆ కొంచెం సేపు ఎమోషనల్ గా, ఆహ్లాదంగా సాగింది. రేపు, ఎల్లుండి ఇదే టాస్క్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Recent Random Post: