‘అమ్మాయిలతో అంత ఈజీ కాదు’ అనే విషయం నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అబ్బాయిలకు బాగా అర్థమయ్యేట్లు కనిపిస్తోంది. కానీ నాగార్జున దగ్గురండి మరీ ఓడిపోతున్న అబ్బాయిలను హారికపై ఉసి గొల్పుతున్నారు. ఎందుకు? ఏ విషయంలో? అని కంగారు పడిపోతున్నారా? మరేం లేదు. ఇవాళ సండే కదా.. అంటే ఫన్ డోసు పెంచేందుకు నాగ్ సిద్ధమయ్యారు. పైగా ఈ వారమంతా కంటెస్టెంట్లు ఉగ్రావతారం ఎత్తి మరీ భీభత్సంగా ఆడేశారు. ఈ క్రమంలో ముఖానికి పెట్టుకున్న మాస్కులు కూడా పోగొట్టేసుకున్నారు. అయితే వారి ఆవేశాన్ని తగ్గించి, కాస్త సరదాను పంచేందుకు నాగ్ వారితో గేమ్స్ ఆడించనున్నారు. ఇంటిసభ్యులు కూడా సై అంటూ ఫుల్ జోష్‌తో ఆటను రష్ఫాడించేస్తున్నారు.
బెలూన్లు పగలగొట్టడం, తిండి పోటీలు, ఏకాగ్రత ఆటలు, ఎక్సర్‌సైజ్ ఫిట్టింగ్‌లు, డ్యాన్సులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో నాగ్ ఫ్రీజ్ అనడంతో కొందరు ఉన్నచోటే శిలావిగ్రహంలా నిలబడిపోగా.. మిగతా కంటెస్టెంట్లు వారిని నవ్వించి ఓడించారు. కానీ హారిక మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా కించిత్తు ఎక్స్‌ప్రెషన్స్ కూడా మార్చకుండా కదలకుండా ఉండిపోయింది. ఆమెను నవ్వించేందుకు అందరూ వీర లెవల్లో ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కాలేకపోయారు. దీంతో నాగ్.. ‘హారికను డిస్టర్బ్ చేసే మగాడే లేడా?’ అని మరింత రెచ్చగొట్టాడు. దీంతో ఎట్టకేలకు ఆమెను నవ్వించి పడగొట్టేశారు. ఇక అప్పుడే నవ్వించి, ఆ వెంటనే ఎలిమినేషన్ అంటూ కంటెస్టెంట్లను కంటతడి పెట్టించే నేటి ఎపిసోడ్ కోసం మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Recent Random Post: