బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 100 – అఖిల్‌ విరహ వేదన, అందరు నేనే నెం.1

బిగ్ బాస్‌ సీజన్‌ 4 చివరి వారం మొదలైంది. కంటెస్టెంట్స్‌ 5 మంది కూడా సోమవారం ఎపిసోడ్‌ లో చిన్న చిన్న చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి వారంలో కూడా గొడవలు పెట్టేందుకే బిగ్‌ బాస్‌ ప్రయత్నించాడు. బిగ్ బాస్‌ సీజన్‌ 4 విజేతగా మీరే ఎందుకు అవుతారు, ఆ ట్రోఫీకి అర్హులు కాని వారు ఎవరు అంటూ బిగ్‌ బాస్‌ ప్రశ్నించగా నేనే నెం.1 అంటూ ప్రతి ఒక్కరు బల్ల గుద్ది మరీ చెప్పారు. అయితే అవతలి వారు అర్హులు కారు అనే విషయం చెప్పడానికి మాత్రం మనసు రాలేదు. అయినా కూడా బిగ్‌ బాస్‌ ఆదేశం కనుక చెప్పేశారు.

ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ కూడా నేనే నెం.1 అంటూ చెప్పుకోవడంతో పాటు అవతలి వారు కాస్త తగ్గి ఉన్నారు అన్నారు. అభిజిత్‌ మాట్లాడుతూ నేనే ఎక్కువ సార్లు నామినేట్‌ అయ్యి సేవ్‌ అయ్యాను. కనుక నేనే నెం.1 నేనే విజేతను అంటూ అభిజిత్‌ పేర్కొన్నాడు. తన దృష్టిలో హారిక అనర్హురాలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే లాజిక్ గా తాను ఫైనల్‌ లో ఈ ముగ్గురితో నిల్చున్నా పర్వాలేదు కాని హారికతో నిల్చోలేను అన్నాడు. మొత్తానికి అభిజిత్‌ క్లియర్‌గా హారికతో నిల్చోవడం నా వల్ల కాదు అన్నాడు. అరియానా చెబుతూ నా వంతు నేను చేసి ఇక్కడకు వచ్చాను. హారిక అర్హురాలు కాదేమో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.

అఖిల్‌ మాట్లాడుతూ నేను చాలా కష్టపడి ఇక్కడకు వచ్చాను. కనుక నేను విజేతను అవుతాను. అరియానా అప్పుడప్పుడు కోపంతో లైన్‌ క్రాస్‌ చేసింది. అందుకే ఆమె అర్హురాలు కాదు అనిపిస్తుంది అన్నాడు. ఇక సోహెల్‌ విషయానికి వస్తే ఖచ్చితంగా తాను అర్హుడిని అంటూ చెప్పడంతో పాటు అరియానా మరియు అభిజిత్‌లు అర్హులు కారు అంటూ చెప్పాడు. ఇక హారిక కూడా తనను తాను చెప్పుకుని అరియానా కు అర్హత లేదు అంది. ఇలా అందరు తాము గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మాస్క్‌ లు తీసేసే టాస్క్‌ ను కూడా ఇచ్చారు.

ఇక మోనాల్‌ పోయిన తర్వాత అఖిల్‌ విరహ వేదన పడుతున్నాడు. కొందరు దాన్ని నాటకం అని కూడా అంటున్నారు అది వేరే విషయం. హారిక వద్దకు సోహెల్‌ వద్దకు వెళ్లి మరీ తన బాధను తానే చెబుతున్నాడు. దీన్ని కాస్త ఓవర్‌ యాక్షన్‌ అంటున్న వారు కూడా లేకపోలేదు. మొత్తానికి బిగ్‌ బాస్‌ లో చివరి వారం మొదటి రోజు అలా అలా గడిచి పోయింది.


Recent Random Post: