బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారం కొనసాగుతుంది. సోమవారం కంటెస్టెంట్స్ మద్య చిన్న చిన్న గొడవలు పెట్టేలా బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చాడు. కాని మంగళవారం ఎపిసోడ్ మాత్రం మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సాగింది. పాత కంటెస్టెంట్స్ రావడంతో హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేవు. చాలా రోజుల తర్వాత వేరే వారిని చూడటంతో అంతా కూడా ఆశ్చర్యపోయారు. సాదారణంగా అయితే హౌస్ లోకి వీళ్లు వెళ్లే వారు. కాని కరోనా భయం కారణంగా వారిని ఎవరిని కూడా లోనికి పంపించలేదు. లైవ్ ద్వారా ఆ నలుగురు ఈ అయిదుగురుతో మాట్లాడేశారు. నిన్న మొత్తం ఎపిసోడ్ వారు సరదా ముచ్చట్లతోనే జరిగి పోయింది.
ఇంతకు ఆ అనలుగురు ఎవరు అంటే.. సీజన్ 1 టాప్ 5 కంటెస్టెంట్ హరితేజ, సీజన్ 2 రన్నరప్ గీతామాధురి, సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి మరియు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా. ఈ నలుగురు కూడా బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఆచి తూచి బయట ఏం జరుగుతుందో వారికి చెప్పకుండా చెప్పాల్సింది చెప్పి, అడగాల్సింది అడిగేసి వచ్చేశారు. ఆ సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులు పాట ప్లే చేయడంతో కంటెస్టెంట్స్ అంతా డాన్స్ చేశారు. ఒకొక్కరు ఒకొక్కరి గురించి పాజిటివ్ గా నెగటివ్ గా కూడా చెప్పేసి వెళ్లి పోయారు. వారు నెగటివ్ కంటే పాజిటివ్ గానే ఎక్కువగా చెప్పారు.
అభిజిత్ నీవు ఎలా ఇంత స్టేబుల్ గా ఉంటున్నావో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాని నువ్వు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నావు. సోహెల్ నీ కోపం కు దండం, నీవు కోపం తెచ్చుకున్న తర్వాత మళ్లీ వెంటనే వారిని బుజ్జగిస్తావు చాలా క్యూట్‌గా ఉంటుందని అన్నారు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదు. అనూహ్యంగా నీలో మార్పు వచ్చింది అంటూ ముఖ్యంగా హరితేజ అంది. అరియానాను లౌడ్ స్పీకర్ అన్నారు. నీవు ఉమెన్ పవర్ అంటూ ప్రశంసించారు. ఇక హారికను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. చోటు అయినా కూడా నీవు పవర్ హౌస్ లా అంటూ ప్రసంశించారు. మొత్తానికి 101 ఎపిసోడ్ సరదా ముచ్చట్లతో సాగిపోయింది.
Recent Random Post: