బిగ్ బాస్ 4: దారుణమైన రేటింగ్స్ తో వెనక్కి తోసేసారుగా

బిగ్ బాస్ సీజన్ 4 కరోనా పరిస్థితుల మధ్య ఉన్నా కానీ నిర్వాహకులు షో ను ముందుకు నడిపించారు. అయితే కరోనా వల్ల పెద్ద సెలబ్రిటీలు ఎవరూ షో లో పాల్గొనడానికి ముందుకు రాలేదు. ఎక్కువ టిక్ టాక్ స్టార్లను సీరియల్స్ లో పెద్దగా పేరు లేని వాళ్ళను తీసుకొచ్చారు. దీంతో ఇది షో పై పెద్ద ఎఫెక్ట్ చూపించింది,

మొదట్లో పర్వాలేదనిపించిన రేటింగ్స్ క్రమంగా పడిపోతూ వచ్చాయి. కరోనా కారణంగా పెద్ద ఫిజికల్ టాస్క్ లు పెట్టకపోవడం, సెలబ్రిటీలు కూడా ఇంటి లోపలకి వచ్చే అవకాశం లేకపోవడంతో అవి షో రేటింగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. వీక్ డేస్ చాలా వీక్ గా ఉండే రేటింగ్స్ నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్ కు మాత్రం మంచి రేటింగ్స్ ను తెచ్చుకున్నాయి.

అదే ఛానల్లో వచ్చే సూపర్ హిట్ సీరియల్స్ కార్తీక దీపం, వదినమ్మకు బిగ్ బాస్ కు ఎక్కువ రేటింగ్స్ కు ఉండడం విశేషం. దీంతో ఇప్పుడు షో టైమింగ్స్ ను మార్చేశారు. బిగ్ బాస్ ను రాత్రి 10 గంటలకు మార్చేశారు. 9.30 స్లాట్ లో వదినమ్మ సీరియల్ ను వేస్తున్నారు. ఏడు గంటలకు కొత్త సీరియల్ వస్తోంది.

అసలే అంతంత మాత్రంగా ఉన్న రేటింగ్స్ ఇప్పుడు 10 గంటలకు వేస్తే రేటింగ్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది.


Recent Random Post: