బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్, శ్రీరామ్, సన్నీ. వీళ్ళ ముగ్గురూ వాళ్ళ డేరాలో ఉండాలి. అలాగే మిగతా కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు ఉంటుంది దానికి కోతి బొమ్మలతో ఉన్న కంటెస్టెంట్ ఫోటోలు ఉంటాయి. ఇక లివింగ్ రూమ్ లో రెండు అరటిపళ్ళు ఉంటాయి. కోతి సౌండ్ చేసినప్పుడు ఆ రెండు అరిటిపళ్ళను ఎవరు పట్టుకుంటారో ఆ ఇద్దరూ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల పేరు చెప్పి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది.
అలాగే గన్ షాట్ వచ్చినప్పుడు డేరాలో ఉన్న వేటగాళ్లలో ఎవరు ముందు వస్తారో వారు ఆ కారణాలను విని నామినేట్ చేసిన ఇద్దరిలో ఒకరి పేరుని అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రాసెస్ మొత్తంలో కేవలం సన్నీ మాత్రమే డేరా నుండి ముందు వచ్చాడు. కనీసం శ్రీరామ్ ప్రయత్నించాడు కానీ జెస్సీ నుండి ఎలాంటి ప్రయత్నమూ రాలేదు.
ఇక ముందుగా కోతి సౌండ్స్ వచ్చినప్పుడు సిరి, షణ్ముఖ్ అరిటిపళ్ళను పట్టుకున్నారు. ఇద్దరూ కూడా ఎన్నీ మాస్టర్ పేరు చెప్పి నామినేట్ చేసారు. ఇద్దరూ ఒకే పేరు చెప్పడంతో ఎవరిది అంగీకరించినా ఎన్నీ మాస్టర్ నామినేట్ అవుతారు. అయితే షణ్ముఖ్ కారణం వాలిడ్ గా ఉందని సన్నీ అభిప్రాయపడ్డాడు. మొత్తం నామినేషన్స్ ప్రాసెస్ లో సన్నీ బయాస్డ్ గా చేసాడని మిగతా ఇంటి సభ్యులు భావించారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రియా, మానస్ నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ప్రియా పేరును నామినేట్ చేసాడు సన్నీ కానీ తన ఫ్రెండ్ కావడంతోనే మానస్ ను నామినేట్ చేయలేదని ఆరోపించారు.
అలాగే అరటిపండును ప్రియా, ప్రియాంక సింగ్ పట్టుకున్నారు. ఆ సమయంలో ప్రియా, రవి సోఫా మీద టవల్ ఆరేసాడు, అందుకని రవిని నామినేట్ చేస్తున్నా అని ప్రియా చెప్పగానే కొంత మంది నవ్వారు. ఇదే నా నామినేషన్ కారణమని ప్రియా అన్నారు. ప్రియా సిల్లీ రీజన్ ఇవ్వడం, ఇతరులు నవ్వడంతో సన్నీ ఇరిటేట్ అయినట్లు అనిపించింది. దాంతో ప్రియాంక వాలిడ్ రీజన్ చెప్పినా కానీ వినకుండా నేను కూడా గేమ్ ఆడతాను అంటూ సన్నీ, రవిను నామినేట్ చేసాడు. అంత సిల్లీ రీజన్ చెప్పినా ఎలా యాక్సప్ట్ చేస్తావు అని రవి ఫైట్ చేసినా లాభం లేకపోయింది.
మొత్తానికి నామినేషన్స్ లో కాజల్, సిరి, ప్రియా, రవి, ఎన్నీ, శ్రీరామ్, జెస్సీ, లోబోలు ఉన్నారు. మిగిలిన వారందరూ అంటే షణ్ముఖ్, మానస్, సన్నీ, విశ్వ, ప్రియాంక సింగ్ లు ఈ వారం సేఫ్ అయ్యారు.
Recent Random Post: