బిగ్ బాస్ 5: సన్నీ ఫ్రస్ట్రేషన్ లో అర్ధముందా?

మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నీ ఇల్లు బంగారం కాను. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అందరూ గోల్డ్ మైనర్స్ గా మారుతారన్న విషయం తెల్సిందే. మొన్నటి ఎపిసోడ్ లో మూడు రౌండ్లు పూర్తవ్వగా, నిన్నటి ఎపిసోడ్ మొదలవ్వడం సన్నీకి పవర్ రూమ్ యాక్సిస్ లభించింది. ఇందులో భాగంగా తనకొచ్చిన పవర్ టూల్ ప్రకారం ఒకరి వద్ద ఉన్న సగం బంగారు ముత్యాలను తీసుకుని మరొకరికి ఇవ్వాలి.

అప్పటికే ప్రియాంక, మానస్ లకు ఎక్కువ ముత్యాలు ఉండడంతో వేరే ఒకరికి హెల్ప్ అవ్వాలని చెప్పి సిరి ముత్యాలను తీసుకుని షణ్ముఖ్ కు ఇవ్వాలని సన్నీ డిసైడ్ చేసాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ మధ్య ఉన్న గ్యాప్ కొంత తగ్గింది. ఇక ప్రియాంక, మానస్ ల వద్ద ఎక్కువ బంగారు ముత్యాలు ఉండటంతో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. వారిలో బెలూన్స్ ఎక్కువ పగలకొట్టి కెప్టెన్సీ కంటెండర్ కు ప్రియాంక అర్హత సాధించింది.

తర్వాత గోల్డ్ మైనింగ్ లో సన్నీ, ఎన్నీ, సిరి, శ్రీరామ్ లు దిగారు. వారిలో సిరికి ఎక్కువ బంగారు ముత్యాలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీరామ్ కు పవర్ రూమ్ కు యాక్సెస్ కూడా దొరికింది. పవర్ టూల్ ను పొందడానికి శ్రీరామ్ ముప్పై బంగారు ముత్యాలను చెల్లించాడు. తీరా అందులో చూస్తే సగం ముత్యాలు తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేయాలని ఉంది. అందుకే తెలివిగా శ్రీరామ్ ఈ పవర్ టూల్ కావాలంటే నాకు 50 ముత్యాలను ఇవ్వాలని డీల్ సెట్ చేసుకున్నాడు. రవి ఈ డీల్ కు దొరికిపోయాడు. శ్రీరామ్ చంద్రకు తన వద్ద ఉన్న ముత్యాలు ఇచ్చాడు. తీరా చూస్తే అందులో మళ్ళీ సగం ముత్యాలు ఇవ్వాలని ఉంది.

ఇక సెకండ్ కెప్టెన్సీ టాస్క్ కు సిరి, సన్నీ అర్హత సాధించారు. అయితే సిరి పర్సనల్ ప్రాబ్లెమ్ వల్ల ఆడట్లేదు కాబట్టి ఆమె మరో హౌజ్ మాటే ను రిక్వెస్ట్ చేయవచ్చు. సిరి, మానస్ ను రిక్వెస్ట్ చేసింది. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో అటు నుండి ఇటు వెళ్తూ ప్రతీ ఎండ్ కు వచ్చినప్పుడు టిషర్ట్ లు ధరించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సన్నీ, మానస్ కంటే ఎక్కువ టిషర్ట్ లు వేసుకున్నా సరిగ్గా వేసుకోలేదని 5 టిషర్ట్ లను పక్కన పెట్టేసాడు రవి. దీంతో మానస్, అంటే సిరి గెలిచినట్లైంది.

రవి తీసుకున్న నిర్ణయం పట్ల సన్నీ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ప్రతీ సరి తన విషయంలో అన్యాయం జరుగుతుందని బాధపడ్డాడు.


Recent Random Post: