బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అజయ్ దేవగన్ హీరోగా దృశ్యం చిత్రాన్ని తెరకెక్కించి విజయం అందుకున్న నిషికాంత్, జులై 31న గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. లివర్ సిరోసిస్‌తో అనే వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే ఆ వ్యాధి మళ్ళీ తిరగబెట్టడంతో ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చింది.
నిషికాంత్ గతంలో మాధవన్, సంగీత హీరో, హీరోయిన్లుగా ఎవరో ఒరువన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కాకుండా పలు బాలీవుడ్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. హిందీలో ముంబై మేరీ జాన్, ఫోర్స్, దృశ్యం, రాకీ హ్యాండ్సమ్, మదారి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మదారి ఆయన తెరకెక్కించిన ఆఖరి చిత్రం.
గత నాలుగైదేళ్ల నుండి దర్శకత్వానికి దూరంగా ఉంటూ నటుడిగా బిజీ అయ్యాడు కామత్. డాడీ, జూలీ 2, భవేష్ జోషి వంటి చిత్రాల్లో నటించాడు. హిందీ చిత్రాలు మాత్రమే కాక మరాఠీ సినిమాల్లో కూడా నటించాడు ఈయన.
నిషికాంత్ కామత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని అందిస్తున్నాం.
Recent Random Post: