‘చావు కబురు చల్లగా’ ట్రైలర్‌ వ‍చ్చేసిందోచ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం సినిమా ‘చావు కబురు చల్లగా’. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం చావు కబురు చల్లగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, డాక్టర్‌ మల్లికగా లావణ్య తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. కార్తికేయ చెప్పే డైలాగులు బాగున్నాయి. కాగా దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు ఆరవింద్‌ గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌లో బన్ని వాసు నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు విశేష స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సాంగ్‌లో బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఆడిపాడారు. కాగా మార్చి 9న జరగబోయే చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ‌టాలీవుడ్‌ స్టార్‌ హీరో‌ అల్లు అర్జున్‌ రాబోతున్నారు. ఇదిలా ఉండగా ఢిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాతో అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కోసం ష‍్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Recent Random Post: