మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ను నెలకొల్పాలని నిశ్చయించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే చిరంజీవి ఈరోజు ట్విట్టర్ లో ఒక చిన్నారి ఆలోచన తనను ఎంతలా కదిలించిందో చెబుతూ వీడియో పోస్ట్ చేసాడు. ఆ చిన్నారి పేరు అంశి ప్రభల. తన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకోకుండా ఆ డబ్బులతో, మరియు తాను దాచుకున్న డబ్బులను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేసింది.
తన చుట్టుపక్కల ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నప్పుడే తాను పుట్టినరోజు జరుపుకోగలనని అంశి అంటోంది. ఇంత చిన్న వయసులో ఇలా ఆలోచించడం చిరంజీవిని కదిలించింది. “తన ప్రేమకు నేను నిజంగా ముగ్దుడినైపోయాను. ఆమె చర్య నన్ను మరింతగా ఇన్స్పైర్ చేసింది. తన కలలన్నీ నిజం కావాలి” అని చిరంజీవి వీడియోలో స్పందించారు.
Recent Random Post: