వివి వినాయక్ కు మెగా క్యాంపుతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలను డైరెక్ట్ చేసాడు వినాయక్. ఈ రెండూ కూడా మంచి విజయం సాధించాయి. ఠాగూర్, ఖైదీ నెం 150, ఈ రెండూ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి.
వివి వినాయక్ చిరంజీవి నటించాల్సిన లూసిఫెర్ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ మార్పులతో చిరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ మోహన్ రాజా చేతుల్లోకి వెళ్ళింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వినాయక్ ఛత్రపతి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం చిరంజీవితో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట.
Recent Random Post: