చిరుకి సోదరిగా స్టార్ హీరోయిన్.!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఈ ఏడాది దాదాలు మూడు సినిమాలు పైనే ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిరు. అందులో మొదటగా ఆచార్య, ఆ ఆతర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్స్ ఉండనున్నాయి. ఇందులో ముందుగా లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఇప్పటికే తమిళ డైరెక్టర్ మోహనరాజా ని ఫైనల్ చేశారు. ఆయన తెలుగు రీమేక్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదేమిటంటే మరోసారి చిరు సినిమాలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకునేలా సంప్రదింపులు జరుపుతున్నాయి. కానీ ఈ సారి చిరుకి జోడీగా కాకుండా చిరుకి గట్టిపోటీ ఇచ్చే సిస్టర్ పాత్ర కోసం అనుకుంటున్నట్లు సమాచారం.

ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకి నయనతార అయితే ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. సైరాలో భార్య భర్తల్లా కనిపించిన చిరు – నయనతారలను, లూసిఫర్ లో అన్న – చెల్లెలిగా చుడనున్నాం. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: