బాలయ్య టాక్ షో లో చిరంజీవి పాల్గొంటారా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ”అన్ స్టాపబుల్ విత్ NBK” టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా లో దీపావళి కానుకగా నవంబర్ 4న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్ స్క్రీన్ మీద భారీ డైలాగ్స్ తో అలరించే బాలయ్య.. ఈ షోని ఎలా హ్యండిల్ చేస్తారో చూడాలని అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో విశేషంగా అలరిస్తోంది.

‘అన్ స్టాపబుల్’ టాక్ షో లో గెస్టులుగా పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో చిరంజీవి – బాలకృష్ణ వేర్వేరు ప్యానల్స్ కు మద్దతు ప్రకటించగా.. బాలయ్య ప్రత్యక్షంగా మద్దతు పలికిన మంచు విష్ణు గెలవగా.. చిరు పరోక్షంగా సపోర్ట్ గా నిలిచిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ టాక్ షో లో చిరు పాల్గొంటారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే బాలయ్య షో లో మొదటి అతిథి చిరంజీవి కాదు.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు అని తెలిసిపోయింది. ఇటీవలే దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. అయితే లేటెస్టుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ కార్యక్రమంలో మొదటి గెస్టుగా రావడానికి చిరంజీవి తిరస్కరించడంతో మంచు ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారని అంటున్నారు. చిరంజీవి నిర్ణయం వెనుక కారణమేంటో తెలియనప్పటికీ.. ఈ మధ్య ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులే కారణమని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బాలకృష్ణ తో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ప్లాన్ చేసింది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అలానే మొదటి గెస్టుగా మోహన్ బాబు ని ఇన్వైట్ చేశారు. దీనిని బట్టే ‘మా’ ఎన్నికల నేపథ్యంలో జరిగినవి ఇరు వర్గాలు పట్టించుకోలేదనేది అర్థం అవుతుంది. కాబట్టి చిరంజీవి ఈ షో లో పాల్గొనడానికి నిరాకరించింది నిజమా కాదా అనేది పక్కన పెడితే.. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ సభ్యులు బాలయ్య షో కు వచ్చే అవకాశం వుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ‘అన్ స్టాపబుల్’ షో కు మరింత హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.


Recent Random Post: