సినిమాలతోనే కాదు.. యంగ్ హీరోలకు ఆ విషయంలో కూడా మెగాస్టార్ పోటీ

మెగా స్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ స్టార్ హీరోలకు ఛాలెంజ్ లు విసురుతున్నాడు. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు.. చిన్నా చితక సినిమాలు అనుకుంటే పొరపాటే. ఆయన నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు అటు ఇటుగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుని యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న చిరంజీవి మరో విషయంలో కూడా వారికి పోటీగా నిలిచేందుకు సిద్దం అయ్యాడు. ఈమద్య కాలంలో యంగ్ స్టార్ హీరోలు పలువురు అదనపు ఆదాయం కోసం బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ ఇలా స్టార్స్ ఎంతో మంది కూడా బ్రాండ్ అంబాసిడర్స్ గా చేస్తూ బుల్లి తెరపై రెగ్యులర్గ ఆ సందడి చేస్తూనే ఉన్నారు.

కోట్ల పారితోషికం దక్కుతున్నందున బ్రాండ్స్ ను ప్రమోట్ చేసేందుకు హీరోలు మొహమాటం లేకుండా ముందుకు వస్తున్నారు. దాదాపు పుష్కర కాలం క్రితం చిరంజీవి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. థమ్స్ అప్ కు అప్పట్లో చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత కూడా కొన్ని సంస్థలను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయిన చిరంజీవి వాటిని కూడా వదిలేశాడు.

మళ్లీ ఖైదీ నెం.150 సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్నన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయడం లేదు అనడంలో సందేహం లేదు. అన్ని సినిమాలు చేస్తున్న చిరంజీవి మరో వైపు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సైన్ చేశాడట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చిరంజీవి పై ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యాడ్ ను షూట్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఒకే సారి గాడ్ ఫాదర్ మరియు ఆ కమర్షియల్ యాడ్ కు సంబంధించిన షూటింగ్ ల్లో చిరంజీవి పాల్గొంటున్నాడట. చరణ్.. బన్నీ లు కమర్షియల్స్ యాడ్స్ చేస్తున్న ఈ సమయంలో చిరంజీవి కూడా భారీ పారితోషికంను అందుకుని ఆ యాడ్స్ చేసేందుకు సిద్దం అవ్వడం ఆయన స్టార్ డమ్ కు నిదర్శణం అనడంలో సందేహం లేదు.

రియల్ ఎస్టేట్ వంటి యాడ్స్ ను చిరంజీవి వంటి పెద్ద వారితో చేయించడం వల్ల ఖచ్చితంగా జనాల్లో సదరు కంపెనీ పై నమ్మకం కలుగుతుంది. అందుకే సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వారు కోట్లాది రూపాయల పారితోషికంను ఇచ్చి చిరంజీవిని ఒప్పించారనే వార్తలు వస్తున్నాయి. చరణ్ ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి చిరంజీవి చేయబోతున్న రరియల్ ఎస్టేట్ సంస్థ ఏదై ఉంటుందో అనే విషయం తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.


Recent Random Post: