“ప్రకటనలు ఘనం – పనులు శూన్యం!“ అన్న చందంగా మారింది ఏపీలో ఫిల్మిండస్ట్రీ సన్నివేశం. కొత్త సినీపరిశ్రమను నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుముఖంగా ఉందని స్టూడియోల నిర్మాణానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని కూడా టాక్ వచ్చింది. కానీ ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా కానీ ఏదీ లేదు.
ఇంతకుముందు తేదేపా ప్రభుత్వ హయాంలో నటసింహా నందమూరి బాలకృష్ణ స్టూడియో నిర్మిస్తారని ప్రచారమైనా కుదరలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. ఇటీవల వైజాగ్ లో మెగాస్టార్ చిరంజీవి స్టూడియో గురించి గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. స్టూడియో లేదా థియేటర్ ను నడపడానికి తనకు ఎలాంటి బిజినెస్ మైండ్ సెట్ లేదని అనడం చర్చనీయాంశమైంది. ఇక అల్లు అరవింద్ .. గంటా వంటి వారికి విశాఖలో స్టూడియోల నిర్మాణం ఆశలు అడుగంటాయన్న చర్చా ఉంది.
అయితే ప్రభుత్వ సహకారం ఉంటే స్టూడియోల నిర్మాణానికి ఇతరులు అయినా ప్రయత్నించే వీలుంటుంది. కానీ వీటి నిర్వహణ అంత సులువు కాదు. ఇప్పటికే హైదరాబాద్ లో అన్నపూర్ణ- రామానాయుడు- పద్మాలయాల- రామకృష్ణ- సారథి- ఆర్.ఎఫ్.సి వంటి అనేక స్టూడియోల నిర్మాణం చాలా కాలం పాటు సాగింది. కానీ వీటి నిర్వహణ భారంగానే ఉంది. వీటిలో కొన్ని స్టూడియోలు మూసివేశారు.
కొన్ని నిర్వహణ కోసం కష్టపడుతున్నాయి. నిర్వహణ ఖర్చు తగ్గించుకోగలిగే యజమానులు మాత్రమే స్టూడియోలను రన్ చేయగలుగుతున్నారు. వైజాగ్ లో సురేష్ బాబు స్టూడియో నిర్వాహణ కష్టంగానే ఉందన్న గుసగుస ఉంది. భూమిని తీసుకోవడంలో చూపుతున్న ఉత్సాహం వ్యాపారంలో చూపడం లేదా? అంటూ ఒక చర్చా సాగుతోంది. హైదరాబాద్ ఔటర్ లోని నానక్ రామ్ గుడ స్టూడియో కనుమరుగవుతుండడంపైనా చర్చ సాగుతోంది.
చాలామంది స్టూడియోల కంటే మల్టీప్లెక్సుల నిర్మాణానికే ఆసక్తిగా కనిపిస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే మహేష్ – అల్లు అర్జున్ – ప్రభాస్ ఉన్నారు. ఇక బన్నీ హైదరాబాద్ ఔటర్ లో స్టూడియో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో నిర్మించే ఆలోచన అల్లు కాంపౌండ్ కి ఉందా లేదా? అన్నదానికి సమాధానం లేదు. ప్రస్తుతం మెగా కాంపౌండ్ నంచి దీనిపై ఎలాంటి ప్రకటనా లేనేలేదు. అయితే చిరంజీవి మాత్రం తన విరామ సమయాన్ని బీచ్ సొగసుల విశాఖలోనే గడుపుతానని ఇంతకుముందు అన్నారు. ఇప్పటికి ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ షూటింగులతో తలమునకలుగా ఉంటున్నారు.
Recent Random Post: