తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్ లో వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా రాష్ట్రం నలుమూలల నుండి కూడా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా పార్టీ భవిష్యత్తు ప్రణాళిక మరియు ప్రభుత్వం పని తీరు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ను అధికారంలో ఉంచేందుకు గాను ప్రతి ఒక్కరు కష్టపడాలని.. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు అందుతున్న విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు.
ఇక మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ మరియు ప్రభుత్వం అద్బుతమైన విజయాలను దక్కించుకుంటుంది. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినట్లుగా ఇండియా ఆలోచిస్తుంది అనే వారు. కాని ఇప్పుడు మాత్రం తెలంగాణ ఆలోచనే ఇండియా ఆలోచన ఆచరణ అంటూ కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఈ సమయంలో కేటీఆర్ కొత్త పేరును పెట్టారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు మరియు రిజర్వాయర్ లు అన్నట్లుగా తెలంగాణ ను హరిత మయం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఈ సందర్బంగా కేటీఆర్ అన్నారు.
Recent Random Post: