వివాదాలకు భయపడే దీపిక వాటిని డిలీట్ చేసిందట

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపిక పదుకునే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఏకంగా 5.25 కోట్ల మంది పాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌ మరియు ఫేస్ బుక్‌ ల్లో కూడా కోట్ల మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. అలాంటి దీపిక పదుకునే అన్ని అకౌంట్స్ నుండి ఫొటోలు హఠాత్తుగా కనిపించకుండా పోయాయి.

వేల కొద్ది ఫొటోలు వీడియోలు ఆమె గతంలో షేర్‌ చేసింది. అవన్నీ కూడా డిలీట్ చేశారు. ఒక్కటి అంటే కనీసం ఒక్క పోస్ట్‌ లేకుండా దీపిక టీం డిలీట్‌ చేయడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. మొదట ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌ లు హ్యాక్‌ అయ్యాయా అనే ప్రచారం జరిగింది. కాని అదేమి కాదని ఆమె టీం పేర్కొంది.

దీపిక ఫొటోలు అన్ని డిలీట్ చేయడానికి ప్రధాన కారణం 2021 సంవత్సరంను చాలా ఫ్రెష్‌ గా ఎలాంటి ఇబ్బందులు వివాదాలు లేకుండా మొదలు పెట్టాలనుకుందట. గత ఏడాది ఆమె డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంది. అందుకే ఆమె చాలా మనస్థాపంకు గురైంది. అందుకు సంబంధించిన మళ్లీ ఎలాంటి వివాదాలు చుట్టు ముట్టకుండా ఉండేందుకు గాను ఆమె తన పాత ఫొటోలు అన్ని కూడా డిలీట్‌ చేసింది.

కొత్తగా కొత్త సంవత్సరంలో వివాదం లేకుండా పొటోలు వీడియోలను షేర్‌ చేయబోతుంది. వివాదాలకు భయపడి ఆమె తన అకౌంట్‌ ను ఖాళీ చేసిందని తేలిపోయింది.


Recent Random Post: