పఠాన్ తో కలిసిన పద్మావత్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా వరుసగా డిజాస్టర్స్ తో గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులను నిరాశ పర్చుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆయన నుండి సూపర్ హిట్ రాబోతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అదే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న పఠాన్. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కూడా చాలా ఆసక్తి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటించడం వల్ల అంతకు మించి అన్నట్లుగా ఆసక్తి నెలకొంది.

పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ మరియు జాన్ అబ్రహం లపై ఇప్పటి వరకు చిత్రీకరణ జరిపారు. దీపిక పదుకునే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. పఠాన్ షూటింగ్ లో దీపిక పదుకునే పాల్గొంటున్నట్లుగా యూనిట్ వర్గాల ద్వారా అధికారిక సమాచారం అందుతోంది. దాదాపుగా 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. ఈ షెడ్యూల్ లో షారుఖ్ మరియు దీపిక పదుకునేల కాంబోలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ముంబయిలో రెండు వారాల షెడ్యూల్ తర్వాత ఆగస్టు నెలలో విదేశాలకు పఠాన్ టీమ్ వెళ్లబోతుందట. ఆ సమయంలో దీపిక పదుకునే కూడా షారుఖ్ మరియు ఇతర యూనిట్ సభ్యులతో వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యం అయిన పఠాన్ ను మరింత ఆలస్యం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈ ఏడాదిలో పఠాన్ రాక అసాధ్యం అని తేలిపోయింది. వచ్చే ఏడాది ఆరంభంలో అయినా పఠాన్ ను విడుదల చేయాలని షారుఖ్ ఖాన్ భావిస్తున్నాడు.


Recent Random Post: