దిల్‌ రాజు గురించి క్రాక్‌, మాస్టర్‌ డిస్ట్రిబ్యూటర్ల మాటల యుద్దం

క్రాక్‌ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ మాట్లాడుతూ థియేటర్ల విషయంలో దిల్‌ రాజు నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెల్సిందే. క్రాక్ సినిమా బాగా ఆడుతున్న సమయంలో సగం థియేటర్ల నుండి తీసేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఆడుతున్న సమయంలో తీయడం అనేది దిల్‌ రాజు కుట్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ సమయంలోనే మాస్టర్‌ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ మహేష్‌ కోనేరు స్పందించారు. మాస్టర్‌ సినిమా ను మొదటి రోజు మొదటి రోజు 150 థియేటర్లోల విడుదల చేశాం. తర్వాత రోజున సినిమాలు విడుదల ఉండటం వల్ల 80 థియేటర్లకు తగ్గించాల్సి వచ్చింది.

సినిమా బాగా ఆడుతున్నా కూడా థియేటర్లు తగ్గించారు అంటే సరి కాదు. పండుగకు మన సినిమానే కాకుండా ఇతర సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు కూడా స్క్రీన్‌ లు షేర్‌ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే థియేటర్లు బాగా ఆడుతున్నా తగ్గించాల్సి ఉంటుంది. పండుగకు అందరు సంతోషంగా ఉండాలి. అన్ని సినిమాలకు మంచి వసూళ్లు రావాలని మహేష్‌ కోనేరు ఇండైరెక్ట్‌ గా క్రాక్‌ డిస్ట్రిబ్యూటర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. తనకు థియేటర్లు తగ్గించినా కూడా కలెక్షన్స్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు.


Recent Random Post: