మాస్టర్ దర్శకుడికి భారీ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీస్

టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ మాంచి దూకుడు మీదుంది. వరసగా టాప్ స్టార్లతో సినిమాలు చేస్తోంది. ఏకంగా డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మితమవుతున్నాయ్.

ఈ చిత్రాలు ఇంకా నిర్మాణ దశలో ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది. ఫామ్ లో ఉన్న హీరో లేదా దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చి వారిని లాక్ చేస్తున్నారు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం లాక్ చేసారు.

ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి డిసైడ్ అయింది మైత్రి సంస్థ. అందుకే ఆ దర్శకుడికి ఏకంగా 5 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఏ హీరోతో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.


Recent Random Post: