సౌత్ లోనే బిగ్ ఓటీటీ డీల్ అలా క్యాన్సిల్

కరోనా నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ ను స్కిప్ చేసుకుని డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలకు ఉన్న మార్కెట్ నేపథ్యంలో కొన్ని సినిమాలు భారీ మొత్తానికి అమ్మడు పోయాయి. మరి కొన్ని మాత్రం నామమాత్రపు ధరలు పలికాయి. మొత్తంగా కరోనా సమయంలో ఓటీటీ వల్ల నిర్మాతలు చాలా లాభం పొందరు అనడంలో సందేహం లేదు. రెండేళ్లు ఒక పూర్తి అయిన సినిమాను విడుదల చేయకుండా ఉంచడం అంటే బడ్జెట్ డబుల్ అవుతుంది. అప్పుడు ఎంత భారీ విజయం సాధించినా కూడా లాభాలు వచ్చేది శూన్యం. అందుకే సౌత్ లో కూడా పలు సినిమాలు ఓటీటీ దారి పట్టాయి. కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ రిలీజ్ కే వెయిట్ చేశాయి. గత ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వాల్సిన కురూప్ మూవీ కరోనా వల్ల ఎట్టకేలకు విడుదల అవ్వబోతుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన కురూప్ ను ఈనెల 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మలయాళంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాబోతున్న బిగ్గెస్ట్ సినిమాగా కురూప్ నిలిచింది. రియల్ గ్యాంగ్ స్టర్ కురూప్ కథతో రూపొందిన ఈ సినిమా పలు భాషల్లో అదే టైటిల్ తో రూపొందుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అన్ని భాషల్లో కూడా మంచి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్ కు ఉన్న క్రేజ్ మరియు కురూప్ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. గత ఏడాది నుండి మొన్నటి వరకు కురూప్ ను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. భారీ ఆఫర్ లను ఓటీటీ వారు ఇచ్చినా కూడా నిర్మాతలు మాత్రం థియేటర్ రిలీజ్ కు ఆసక్తి చూపించారు.

మలయాళంలో మాత్రమే కాకుండా సౌత్ లో ఏ భాష సినిమాకు అయినా 40 నుండి 50 కోట్లు ఓటీటీ రేటు పలకడం అంటే ఖచ్చితంగా బిగ్ డీల్ అనడంలో సందేహం లేదు. అలాంటి బిగ్ డీల్ కురూప్ కు వచ్చిన సమయంలో నిర్మాతలు ఒకానొక సమయంలో ఓకే అనాలని అనుకున్నారట. కాని మమ్ముట్టీ సినిమాను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. యూనివర్శిల్ సబ్జెక్ట్ కనుక ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని.. ఓటీటీ లో చూస్తే సినిమా ఫీల్ దెబ్బ తింటుందని అందుకే ఈ సినిమా ను థియేట్రికల్ రిలీజ్ కే వెళ్లాలంటూ ఆయన సలహా ఇచ్చాడట.

మమ్ముట్టీ సలహాతో పాటు సినిమా పై వారికి ఉన్న నమ్మకం తో భారీ ఓటీటీ డీల్ ను వద్దనుకున్నారట. ప్రస్తుతం థియేటర్ లో ఈ సినిమా విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ కు తెలుగు మరియు తమిళంలో మంచి గుర్తింపు ఉంది. కనుక ఖచ్చితంగా మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు మరియు తమిళ ఆడియన్స్ నుండి కూడా కురూప్ కు మంచి వసూళ్లు దక్కే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందిన కురూప్ లో దుల్కర్ గెటప్ చాలా విభిన్నంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.


Recent Random Post: