స్టార్‌ హీరో సినిమాలను బహిష్కరిస్తున్న థియేటర్ల యాజమాన్యాలు

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పై కేరళ రాష్ట్రంలోని థియేటర్ల యాజమాన్యాలు బ్యాన్‌ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన సెల్యూట్ సినిమాలో థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్‌ గా ఓటీటీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవడంతో థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం కరోనా వల్ల థియేటర్లు మూతపడడంతో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా సినిమాలను విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో థియేటర్ల యాజమాన్యాలు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు అన్ని సాధారణ స్థితిలో నడుస్తున్నాయి.

ఈ సమయంలో ఎందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వెళ్లాలి అంటూ యాజమాన్య సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు స్టార్ హీరోలు కూడా థియేటర్ లోకి రాకపోతే పరిస్థితి ఏంటి అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఎలాగూ డిజిటల్ ప్లాట్ ఫారంలో రిలీజ్ చేస్తారు కనుక ముందుగానే డిజిటల్ గా ఎందుకు వెళ్లాలి అనేది థియేటర్ల యాజమాన్యాలు ప్రశ్న.

థియేటర్లలో విడుదలకు ముందే డిజిటల్ ప్లాట్ ఫారంలో కి వెళ్తున్నందుకు గాను దుల్కర్ సల్మాన్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ముందు ముందు డిజిటల్ ప్లాట్ఫారం లోనే విడుదల చేసుకోవాల్సి ఉంటుందని.. ఇక మీదట ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల చేయబోమని వారు ప్రకటించారు. ఈ వివాదంపై దుల్కర్ సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Recent Random Post: