ఈసారి బిగ్‌బాస్‌లోకి టిక్‌టాక్ దుర్గారావ్‌

టిక్ టాక్ దుర్గారావ్‌ గురించి తెలుగు సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దుర్గారావు ఎంత ఫేమస్ అయ్యాడో జబర్దస్త్‌ ఢీ షో చూసే వారికి తెలుసు. అన్ని ఛానెల్స్ లో కూడా దుర్గారావ్‌ మరియు ఆయన భార్య చేసిన సందడి మామూలుగా లేదు. దుర్గారావు వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. అలా ఆయన కూడా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని బిగ్‌ బాస్ లోకి తీసుకోవడం పరిపాటిగా వస్తుంది. కనుక సీజన్ 5 బిగ్ బాస్ మొదటి కంటెస్టెంట్‌ గా దుర్గారావు ఎంపిక అవ్వడం ఖాయం అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.

దుర్గారావుతో పాటు సోషల్‌ మీడియాకు చెందిన మరి కొందరు కూడా ఈ సీజన్‌ లో పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 మరో నాలుగు నెలల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. కాని ఈ సారి మరీ ఎక్కువ ఆలస్యం కాకుండా కాస్త ముందే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే స్టార్ మా మరియు బిగ్‌ బాస్ నిర్మాణ సంస్థ వారు కంటెస్టెంట్స్ ఎంపిక విషయమై చర్చలు ప్రారంభించారనే వార్తలు వస్తున్నాయి. మొదటగా 200 మందిని ఎంపిక చేసి వాటిలోనుండి ఫైనల్‌ గా 20 మందిని ఎంపిక చేస్తారు. అలా బిగ్ బాస్ ఫైనల్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక అవుతారు. అందులో దుర్గారావు ఉంటాడా లేదా అనేది చూడాలి.


Recent Random Post: