యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. గత కొంత కాలంగా గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు ఫలితాలనే అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ రాబోతోన్న తన నెక్స్ట్ సినిమా సీటిమార్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్ నటిస్తున్నాడు. గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఏప్రిల్ 2న సీటిమార్ ను విడుదల చేయనున్నారు.
అయితే దానికంటే ముందు మార్చ్ 28న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రెబెల్ స్టార్ ప్రభాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ అందుబాటులో ఉంటాయా లేదా అన్నది చూస్తున్నారు. సంపత్ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే.
Recent Random Post: