Harish Rao Apologise to Party Activists in Siddipet Public Meeting

Share

Watch Harish Rao Apologise to Party Activists in Siddipet Public Meeting


Recent Random Post:

అంజి డైరెక్షన్‌లో నితిన్ కమ్‌బ్యాక్? అభిమానుల్లో కొత్త ఆశలు

January 24, 2026

Share


వరస పరాజయాలతో హీరో నితిన్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, మరోవైపు భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత దిల్ రాజు వెనక్కి తగ్గి దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా ఫిక్స్ చేయడం—ఇవన్నీ కలిపి నితిన్ అభిమానుల్లో ఒక మంచి సినిమా చేజారిపోయిందనే ఫీలింగ్‌ను పెంచేశాయి.

ఇదిలా ఉండగా, హ్యాట్రిక్ ఫ్లాపులతో ఇప్పటికే రిస్క్ జోన్‌లోకి వెళ్లిన నితిన్, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘స్వారీ’ అనే ప్రాజెక్ట్ చేయబోతున్నాడంటూ కొంతకాలం బలమైన ప్రచారం సాగింది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

ఇక్కడితో ఆగలేదు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘కల్ట్’ మూవీ మొదట నితిన్ దగ్గరకే వచ్చిందని ఇండస్ట్రీ టాక్. అయితే ఏమైందో తెలియదు కానీ దర్శకుడు ఆదిత్య హాసన్ చివరకు తన ఛాయిస్ మార్చుకున్నాడు. వరుసగా అవకాశాలు చేజారుతుండటంతో, ఒక్క పెద్ద హిట్ పడితే మళ్లీ ట్రాక్‌లోకి రావచ్చన్న ఆశతో నితిన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు.

ఆ నిరీక్షణకు ఇప్పుడు కొంత ఊరట లభించేలా ఉంది. 2024లో ‘ఆయ్’ సినిమాతో సర్ప్రైజ్ సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అంజి కె మణిపుత్రకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ సినిమాను నితిన్ స్వంత బ్యానర్ ‘శ్రేష్ట్ మూవీస్’లోనే నిర్మించేందుకు ప్లాన్ సిద్ధమైందని సమాచారం.

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో ‘తెలుసు కదా’ ఫేమ్ నీరజ కోనతో ఒక సినిమా లాక్ చేసుకునే ఆలోచనలో కూడా నితిన్ ఉన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను లేట్ చేస్తాడా లేక షూటింగ్ క్రమాన్ని మార్చుతాడా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఒకప్పుడు ప్రామిసింగ్ మార్కెట్‌తో దూసుకెళ్లిన స్థాయి నుంచి ఇప్పుడు అవకాశాలు, కాంబినేషన్లు జాగ్రత్తగా ఎంచుకునే దశకు వచ్చిన నితిన్, అంజి లాంటి ట్రెండ్ సెన్స్ ఉన్న దర్శకుడితో చేయి కలపడం సరైన నిర్ణయమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లోనూ కంటెంట్ + ఎంటర్‌టైన్‌మెంట్ సరైన మిశ్రమం ఉంటే బ్లాక్‌బస్టర్లు సాధ్యమని గత ఏడాది సినిమాలు రుజువు చేశాయి. అదే కోవలో నితిన్ కూడా బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానుల కోరిక.