న్యాచురల్ స్టార్ నాని ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా వరసగా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 3 లేదా 2 సినిమాలు విడుదల చేయడం నానికి అలవాటు. అలాంటి నాని ప్లాన్స్ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొట్టింది. నాని నటిస్తున్న సినిమాలు మూడు వివిధ ప్రొడక్షన్ దశల్లో ఉండిపోయాయి.
టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ దశలో ఉంది. అంటే సుందరానికి షూటింగ్ ఇంకా మొదట్లోనే ఉంది. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ సినిమా విడుదలై, శ్యామ్ సింగ రాయ్ పూర్తయితే కానీ నాని కొత్త సినిమాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాడు.
నానికి కొత్త దర్శకుడు శ్రీకాంత్, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ నుండి కథలు వచ్చాయి. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అవి హోల్డ్ లో పెట్టినట్లే.
Recent Random Post: